Sunday, 2 September 2018

Vedakani chote ledu





వెదకని చోటే లేదు (Vedakani Chote Ledu)

పల్లవి:        వెదకని చోటే లేదు నా దేవుని కోసం
              వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం ||2||
              వెదకితిని వేసారితిని అంతటా తిరిగితిన్
              తను కానరాక నే కలత చెందితి ||2||
              వేదనతో రోధనతో కన్నీరు కార్చితి
              నా లోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు ||2||
              ప్రేమే దేవుని స్వభావము ప్రేమే దేవుడు ||2||

1.  కొండలనడిగ కొండ కోనల నడిగా నా ప్రభువెక్కడని
     సంద్రమును జలరాశుల నడిగ నా ప్రభువెక్కడని
     అడవులనడిగ అందుజీవుల నడిగ ||2||
     ఉలుకే లేదు పలుకే లేదు జవాబేలేదు ||నాలో||

2.  రివ్వున ఎగిరే గువ్వల నడిగ దేవుడు ఎక్కడని
     సుమధుర గానాల కోయిల నడిగ నా ప్రభువెక్కడని
     జలజల పారే సెలయేటి నడిగ ||2||
    ఉలుకే లేదు పలుకే లేదు జవాబేలేదు ||నాలో||

No comments:

Post a Comment