Sunday, 2 September 2018

Nuvuleni naa jeevitam



నువ్వులేని నా జీవితం నా యేసయ్యా

పల్లవి:        నువ్వులేని నా జీవితం నా యేసయ్యా – దారం తెగిన గాలి పటం
              నువ్వులేని నా జీవితం నా యేసయ్యా – గమ్యము లేని గాలి పటం
              రావయ్యా నా యేసయ్యా – నా చేయి పట్టి నడిపించవా
              నా మార్గము నీవై – నా గమ్యము నీవై నను నీవు నడిపించవా
              నువ్వులేని నా జీవితం నా యేసయ్యా – దారం తెగిన గాలి పటం

1.   నది సంద్రములో నడచిన దేవా 
      గాలి తుఫానును అణచిన దేవా
      నా లోని విశ్వాసము బాల పరచవా ||2||
      కరుణతో కరుణించి కాపాడవా కరుణామయా
     నువ్వులేని నా జీవితం నా యేసయ్యా
      గమ్యము లేని గాలి పటం ||నువ్వు||

2.     ప్రార్థనచేయుట నేర్పిన దేవా 
        రక్త చెమటలతో ప్రార్ధించితివా
       నా ప్రార్ధనను బలపరచవా ||2||
      దయతో దీవించి దరిచేర్చవా – దయామయా |నువ్వు|

No comments:

Post a Comment