సాకి: సర్వ సృష్టి స్థితిలయ కారకా
శ్రీ (యెహోవా)
ప్రభువైన దేవా
కన్య మరియ గర్భాన వెలసిన
శ్రీ యేసునాధా...
పిత సుతులకు అనుబంధమా
పవిత్రాత్మా నమస్తే....
నమస్తే...నమహః...
పల్లవి: చేరితి ప్రభువా నీ సన్నిధి
పూజలు చేయగా నా పెన్నిధి
పాడి స్తుతింతును నీ దివ్య నామం
వరములు చిందే ఈ దివ్యబలిలో
1. చీకటి ముసిరిన బ్రతుకులలో
వేదన నిండిన
ఎడదలలో
వెలుగును నింపే జ్యోతివి నీవు
నీ కృప మాపై
ప్రసరించు దేవా ||చేరితి||
2. శోధన బాధలు కలిగిన వేళ
నీ
సిలువే మా కాశ్రయ దుర్గం
నూతన బలమును ఒసగుము దేవా
కనురెప్పల మము కాయుము ప్రభువా ||చేరితి||
No comments:
Post a Comment