నా హృదయం తెరిచాను
పల్లవి: నా హృదయం
తెరిచాను
నీ కోసమే తెరిచాను నీ కోసమే ప్రభూ
నీ మందిరం కావాలి నా మది ఎల్లప్పుడు ||2||
1. నా ఆశవు
నా శ్వాసవు నా గమ్యము నీవే
నాలో వసియింపుము
నా జీవన రాగమై ||2||
నన్ను నీవు మరిచావో
నా బ్రతుకే శూన్యం
నీ సన్నిధియేకదా
నాకు పెన్నిధి ప్రభువా ||2|| ||నా||
2. నీ రప్పల
మాటున నన్ను దాగిపోనీ
నీ ఆలయ దీపానికి
ఆజ్యమై కరిగిపోనీ ||2||
నీ చరణాలపై వాలే
ధూళిరేణువు కానీ
నీ దరినే కడదాక నన్ను
ఉండిపోనీ ||2||
No comments:
Post a Comment