Sunday, 2 September 2018

యాజకులారా ప్రభు సేవకులార


యాజకులారా ప్రభుసేవకులారా(దివ్య రాగం)

పల్లవి:       యాజకులారా ప్రభుసేవకులారా ||2||
                 దైవజనులారా విశ్వాసులారా ||2||
                 తరలిరండి చేర రండి ||2|| - కదరభోజన స్మరణ బలికి ||2||
                 స్వాగతం గమనిపగ – సుస్వాగతం సరిపమగ
                 సుస్వాగతం మగపమపా – సుస్వాగతం పనిగరిసా
                 స్వాగతం స్వాగతం – సుస్వాగతం సుస్వాగతం ||2||
                 స్వాగతం స్వాగతం ఘనస్వాగతం
                   సరిసా నిరాపమపా

 ఆదామవ్వల పాప హరణ యాగమిది
ఆదిమ బలులను ఏకము చేయు బలి యిది ||2||
జీవిత దేవునికి అర్పిత బలి యిది ||2||
శ్రీసభ జనులకు వర పూజ యిది
రండి రారండి బలి పూజలో పాల్గొన రారండి
రండి రారండి ముదమార దేవుని స్తుతి యించుడి ||స్వాగతం||

 గురుకరములతో అర్పితమగు ఈ బలియాగం
ఆత్మల నిరతం పదిలము చేయు స్తుతి యాగం ||2||
పావన దేవునికి ప్రీతికరం ||2|| పావన జనులకు రక్షణ  వరం
రండి రారండి బలి పూజలో పాల్గొన రారండి
రండి రారండి ముదమార దేవుని స్తుతి యించుడి ||స్వాగతం||

No comments:

Post a Comment