Sunday, 2 September 2018

Ni chetito nannu pattuko


నీ చేతితో నన్ను పట్టుకో

పల్లవి:    నీ చేతితో నన్ను పట్టుకో 
               నీ ఆత్మతో నన్ను నింపుము
               శిల్పి చేతిలో శిలను నేను  
              అనుక్షణము నన్ను చెక్కుము

1.      ఘోరపాపిని నేను తండ్రి 
          పాప ఊబిలో పడియుంటిని
         లేవనెత్తుము శుద్ధిచేయుము 
         పొందనిమ్ము నీదు ప్రేమను ||నీ||

2.      అంధకార లోయలోన 
         సంచరించిన భయము లేదు
         నీవాక్యం శక్తిగలది
         నా త్రోవకు నిత్య వెలుగు ||నీ||

3.    ఈ భువికి రాజువు నీవే 
       నాహృదిలో శాంతి నీవే
       కుమ్మరించుము నీదు ఆత్మను 
       జీవితాంతం నీ సేవచేసెదన్ ||నీ||

Na hrudayam therichanu


నా హృదయం తెరిచాను

పల్లవి:      నా హృదయం తెరిచాను
                 నీ కోసమే తెరిచాను నీ కోసమే ప్రభూ
                నీ  మందిరం కావాలి నా మది ఎల్లప్పుడు ||2||

1.     నా ఆశవు నా శ్వాసవు నా గమ్యము నీవే
       నాలో వసియింపుము నా జీవన రాగమై ||2||
       నన్ను నీవు మరిచావో నా బ్రతుకే శూన్యం
       నీ సన్నిధియేకదా నాకు పెన్నిధి ప్రభువా ||2|| ||నా||

2.     నీ రప్పల మాటున నన్ను దాగిపోనీ
       నీ ఆలయ దీపానికి ఆజ్యమై కరిగిపోనీ ||2||
       నీ చరణాలపై వాలే ధూళిరేణువు కానీ
       నీ దరినే కడదాక నన్ను ఉండిపోనీ ||2||

Deva ni sparshato


దేవా నీ స్పర్శతో

పల్లవి:   దేవా నీ స్పర్శతో – దేవా నీ శ్వాసతో ||2||
              చేశావు నన్ను మలిచావు నన్ను 
              నీ కంటి పాపగా నిలిపావులే ||2||

1.  కుష్ఠరోగి దరి చేరి ప్రార్థింపగా 
     కరుణ జాలి ప్రేమతో దీవించావు ||2||
     నీ చేతి స్పర్శతో – పరిశుద్ద వాక్కుతో
     నీ ప్రియమైన బిడ్డగా నడిపించుమా ||2||
     నీ పరలోక రాజ్యమున – నను చేర్చుమా ||2|| ||దేవా||

2.     రక్తశ్రావ రోగి నిన్ను తాకినంతనే 
        తనవులోని దైవశక్తి కదలిపోయెను
       నీ జీవ వాక్కుతో పరిశుద్ద వాక్కుతో
       నీ ప్రియమైన బిడ్డగా నడిపించుమా ||2||
       నీ పరలోక రాజుఅమున – నను చేర్చుమా ||2|| ||దేవా||

Dayachupumaya


దయచూపుమయ్య నా యేసయ్య (పవిత్రాత్మ స్వరం-1)

పల్లవి:    దయచూపుమయ్య నా యేసయ్య 
               పాపపు ఊబిలో చిక్కినానయ్య ||2||
               ఆత్మను పంపి అభయమీయ్యవా 
               కరుణసాగరా నా యేసయ్య ||2||

1.   పాపపు మగ్దలేనను క్షమించినయేసా
      పశ్చాత్తాప పేతురును ఆదరించిన యేసా ||2||
      రావయ్య.. నా జీవితాన 
      ప్రసాదించుమయ్య ఈ క్షమాపణను ||దయ||

2.    పాపకరమైన కరములకు అపవిత్రమైన పెదవులకు
       నిలువని నా మనసులకు ||2||
       ప్రసాదించుమయా నాయనా నిలకడను ||దయ||

Swagatam suswagatam


స్వాగతం సుస్వాగతం(పవిత్రాత్మ స్వరం-1)

పల్లవి:       స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం ||2||
                   సుస్వరాల శుభ సప్త స్వరాలతో 
                   హృదయపూర్వక ఘన స్వాగతం ||2||
                   దైవజనమ రారండి దేవుని దీవెన పొందండి ||2||

1.    అలసి సొలసిన జనులారా నా యొద్దకు రమ్మని పిలిచెనుగా ||2||
      కష్టసుఖాలతో వ్యాధిబాధలతో ||2|| 
      దేవుని స్తుతించి ఆరాధిద్దాం ||2||
     దైవ జనమా రారండి దేవుని దీవెన పొందండి ||2||

2.   నేనే సత్యమం జీవం మార్గం అనుసరింపుమని పలికెనుగా ||2||
     ఏకకుటుంబం ఐక్య సంఘముగా ||2|| 
     దేవుని స్తుతించి ఆరాధిద్దాంబ ||2||
     దైవ జనమా రారండి దేవుని దీవెన పొందండి ||2||

యాజకులారా ప్రభు సేవకులార


యాజకులారా ప్రభుసేవకులారా(దివ్య రాగం)

పల్లవి:       యాజకులారా ప్రభుసేవకులారా ||2||
                 దైవజనులారా విశ్వాసులారా ||2||
                 తరలిరండి చేర రండి ||2|| - కదరభోజన స్మరణ బలికి ||2||
                 స్వాగతం గమనిపగ – సుస్వాగతం సరిపమగ
                 సుస్వాగతం మగపమపా – సుస్వాగతం పనిగరిసా
                 స్వాగతం స్వాగతం – సుస్వాగతం సుస్వాగతం ||2||
                 స్వాగతం స్వాగతం ఘనస్వాగతం
                   సరిసా నిరాపమపా

 ఆదామవ్వల పాప హరణ యాగమిది
ఆదిమ బలులను ఏకము చేయు బలి యిది ||2||
జీవిత దేవునికి అర్పిత బలి యిది ||2||
శ్రీసభ జనులకు వర పూజ యిది
రండి రారండి బలి పూజలో పాల్గొన రారండి
రండి రారండి ముదమార దేవుని స్తుతి యించుడి ||స్వాగతం||

 గురుకరములతో అర్పితమగు ఈ బలియాగం
ఆత్మల నిరతం పదిలము చేయు స్తుతి యాగం ||2||
పావన దేవునికి ప్రీతికరం ||2|| పావన జనులకు రక్షణ  వరం
రండి రారండి బలి పూజలో పాల్గొన రారండి
రండి రారండి ముదమార దేవుని స్తుతి యించుడి ||స్వాగతం||

యజకుడా క్రీస్తు రాజా


యాజకుడా! క్రీస్తురాజా!

పల్లవి:         యాజకుడా! క్రీస్తురాజా! – నిత్యగురువా నీతిమంతుడా!
                   పాడెదమూ – దూతల బృందముతో కలసి పాడుదాం
                   స్వాగతం – సుస్వాగతం – స్వాగతం – ఘనస్వాగతం

1.  పరమ దేవుని ప్రియసుతుడు 
    లోక ప్రధాన అర్చకుడూ
    సత్యసమర్పణగావించెను ||స్వా||

2. ప్రభుని సన్నిధి మోకరించి
    హృదయ అర్చన – చేయుదాం
    చేతులు మోడ్చి ఆరాధించి 
    దేవుని దీవెనలు పొందుదాం ||స్వా||

సుప్రభాత వేళలో


సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగ 

సాకి:       సృష్టికర్త తండ్రి దేవుని ఆరాధింప - రక్షణ దాత క్రీస్తు ప్రభుని ప్రార్థింప
              వరప్రదాత పవిత్రాత్మ సర్వేశుని ప్రణుతింప - దైవ జనమా రారే
              త్రియేక దేవుని కొలువగ రారే
             
             సాసససస గరిపగరి సాసససస గరిపగరి - పాపపపప నిపసనిపగ
             పాపపపప నిపసనిపగ - పనిసరిగా గపనిసరి గాగరిసని
             రిరిసనిప సాసనిపగా - రిగపనిస గపనిస పనిస

పల్లవి:   సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగ
            గుడిగంటలు మ్రోగే ప్రభు పూజకు రమ్మని ||2||
            ఆ జీవదాతను కొలువగ నేడే - పరిమళాల నవ సుమాల మాలలతో
            కదలి రండి తరలి రండి వేవేగమే       ||2|| || సుప్రభాత||

1.      ఆదాము పాపము తను బాపుటకు - అరుదెంచెను ఆ దైవమే
         మూసియున్న స్వర్గద్వారములు తెరచుటకు - తానాయెను బలి గొఱ్ఱెపిల్ల ||2||
       కల్వరి బలి వేదికపై అర్పించె యాగబలి   ||2||
       ఆ దివ్య బలికి శుభ సమయమిదే - మచ్చలేని స్వచ్చమైన హృదయాలతో
       కదలి రండి తరలి రండి వేవేగమె  ||2||  ||సుప్రభాత||

2.  అపవాది దాస్యమున మన విడుదలకు - తను చెల్లించే రక్తమూల్యము
     పరలోక తండ్రి దరికి మనలను చేర్చ - నూతన పాస్కగ తను మారెను ||2||
    యాజకుడు అర్పించే ఈ దివ్య పీఠముపై  ||2||
    శాంతి దూత అతడు  వేంచేయును - మరువలేని మధురమైన గీతికతో
    పాడరండి కొలువగ రండి వేవేగమె        ||2||  ||సుప్రభాత||

నీవు గనక లేకపోతే



నీవు గనక లేకపోతే

పల్లవి:        నీవు గనక లేకపోతే – నా బ్రతుకంతా శూన్యమయ్యా
              యేసయ్యా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా ||2||

1.    నా జీవిత నావలో నాపడవ ప్రయాణంలో నీవు గనక లేకపోతే
      నా హృదయ వేదనలో నా ఆఖరి శ్వాసలో – నీవు గనక లేకపోతే ||2||
     అంతా శూన్యం బ్రతుకంతా శూన్యం నా చేయి పట్టి నడిపించరావయ్య
     యేసయ్యా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా ||2||

2.  ఈలోక సంపదలు నేను కలిగినా నీవు గనక లేకపోతే
    ఎన్నెన్నో పధకాలు నేను వేసినా నీవు గనక లేకపోతే ||2||
    అంతా శూన్యం బ్రతుకంతా శూన్యం నా చేయి పట్టి నడిపించరావయ్య
     యేసయ్యా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా ||2||

Nuvuleni naa jeevitam



నువ్వులేని నా జీవితం నా యేసయ్యా

పల్లవి:        నువ్వులేని నా జీవితం నా యేసయ్యా – దారం తెగిన గాలి పటం
              నువ్వులేని నా జీవితం నా యేసయ్యా – గమ్యము లేని గాలి పటం
              రావయ్యా నా యేసయ్యా – నా చేయి పట్టి నడిపించవా
              నా మార్గము నీవై – నా గమ్యము నీవై నను నీవు నడిపించవా
              నువ్వులేని నా జీవితం నా యేసయ్యా – దారం తెగిన గాలి పటం

1.   నది సంద్రములో నడచిన దేవా 
      గాలి తుఫానును అణచిన దేవా
      నా లోని విశ్వాసము బాల పరచవా ||2||
      కరుణతో కరుణించి కాపాడవా కరుణామయా
     నువ్వులేని నా జీవితం నా యేసయ్యా
      గమ్యము లేని గాలి పటం ||నువ్వు||

2.     ప్రార్థనచేయుట నేర్పిన దేవా 
        రక్త చెమటలతో ప్రార్ధించితివా
       నా ప్రార్ధనను బలపరచవా ||2||
      దయతో దీవించి దరిచేర్చవా – దయామయా |నువ్వు|

Lekkaleni papalu




లెక్కలేని పాపాలు (Lekkaleni Paapaalu)

పల్లవి:        లెక్కలేని పాపాలు భారమైన జీవితం
              నూనెలేని దీపములా సాగుచున్న జీవితం
              పగిలి పోయిన మట్టిపాత్రను నేను నాధా
              మరలా నాకు పునర్జీవిత మొసగుమోనాధా  ||2|| ||లెక్క||
              కరుణ చూపుమా నాపై కనికరించుమా
              పాపిని నేను నాధా పాపినీ నేను ||2||

1.     పూర్వపాపపు శాపము మోయుచుండగా
       వ్యాధియు, బాధలు అధికమాయెను ||2||
       దేవా దేవుని ఆత్మ నాలో నీర్జీవమై – పాపం నన్ను పాతాళ త్రోవలో చేర్చే
       కరుణ చూపుమా నాపై కనికరించుమా
       పాపిని నేను నాధా పాపినీ నేను ||2||

2.    వేంచేసి రావయ్యా మంచి దైవమా
       ప్రేమను కరుణను ఒసగుమో ప్రభువా ||2||
       పదిరెట్లు ప్రేమతో తిరిగి నే వచ్చెద
      మరల నన్ను నీ రెక్కల నీడలో వుంచు
      కరుణ చూపుమా నాపై కనికరించుమా
      పాపిని నేను నాధా పాపినీ నేను ||2||

Vedakani chote ledu





వెదకని చోటే లేదు (Vedakani Chote Ledu)

పల్లవి:        వెదకని చోటే లేదు నా దేవుని కోసం
              వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం ||2||
              వెదకితిని వేసారితిని అంతటా తిరిగితిన్
              తను కానరాక నే కలత చెందితి ||2||
              వేదనతో రోధనతో కన్నీరు కార్చితి
              నా లోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు ||2||
              ప్రేమే దేవుని స్వభావము ప్రేమే దేవుడు ||2||

1.  కొండలనడిగ కొండ కోనల నడిగా నా ప్రభువెక్కడని
     సంద్రమును జలరాశుల నడిగ నా ప్రభువెక్కడని
     అడవులనడిగ అందుజీవుల నడిగ ||2||
     ఉలుకే లేదు పలుకే లేదు జవాబేలేదు ||నాలో||

2.  రివ్వున ఎగిరే గువ్వల నడిగ దేవుడు ఎక్కడని
     సుమధుర గానాల కోయిల నడిగ నా ప్రభువెక్కడని
     జలజల పారే సెలయేటి నడిగ ||2||
    ఉలుకే లేదు పలుకే లేదు జవాబేలేదు ||నాలో||

Cherithi Prabhuva Nee Sannidhi


                  



         చేరితి ప్రభువా నీ సన్నిధి


సాకి:           సర్వ సృష్టి స్థితిలయ కారకా 
                     శ్రీ (యెహోవా) ప్రభువైన దేవా
                       కన్య మరియ గర్భాన వెలసిన  
 శ్రీ యేసునాధా...
                      పిత సుతులకు అనుబంధమా 
                               పవిత్రాత్మా నమస్తే.... నమస్తే...నమహః...

పల్లవి:     చేరితి ప్రభువా నీ సన్నిధి
                    పూజలు చేయగా నా పెన్నిధి
                             పాడి స్తుతింతును నీ దివ్య నామం
                          వరములు చిందే ఈ దివ్యబలిలో

1.     చీకటి ముసిరిన బ్రతుకులలో 
 వేదన నిండిన ఎడదలలో
        వెలుగును నింపే జ్యోతివి నీవు 
                      నీ కృప మాపై ప్రసరించు దేవా ||చేరితి||

2.    శోధన బాధలు కలిగిన వేళ 
         నీ సిలువే మా కాశ్రయ దుర్గం
              నూతన బలమును ఒసగుము దేవా
                                       కనురెప్పల మము కాయుము ప్రభువా      ||చేరితి||