Tuesday, 9 November 2021

Paruguna randi dhaivajannama prabhuni sanidhiki

 ENTRANCE HYMN

Randi randi prabhuni sannidhiki

Santhasamutho divya pennidhiki

Paruguna randi dhaivajannama

prabhuni sanidhiki

Vachicherudi santhasamutho

dhivya pennidhiki

Ahvanithumu dhevuni kumaruni -2

Randi randi randi randi-2

Devuni sanidhiki divya penidhiki

 

  1

Prabhuni vakyam madhura madhuram

Alakinchi dhyaninchudham

Jivammiche paramavakyam

Maru manasunu prasadhinchunu

Sampurna hrudhayalatho

Palgona pradhanalo “3”


 2

Prabhunivindhunu swikarichi

Nimpudham mana hrudhayalany

Atmanunimpe amaravindhunu

Aaraginchi thari inchudham

Santhosha hrudhayalatho

Vemcheyudu pujaku “3”

Thursday, 16 July 2020

Tenekanna Teeyanainadi

Telugu Lyrics

తేనే కన్న తియ్యనయినది నా యేసు ప్రేమ
మల్లే కన్న తేల్లనయినది – 2
నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను
కష్టకాలమందు నాకు తోడైయుండెను – 2

ఆగక నే సాగిపోదును
నా ప్రభువు చూపించు బాటలో – 2
అడ్డంకులన్ని నన్ను చుట్టినా
నా దేవుని నే విడుపకుందును – 2 “తేనే”
నా వాల్లే నన్ను విడిచిన
నా బంధువులె దూరమయిన – 2
ఏ తోడు లేక ఓంటిరినయినాను
నాతోడు క్రీస్తని ఆనందింతును – 2 “తేనే”

English Lyrics

Tene kanna thiyyanainadi na yesu prema 
malle kanna thellanainadi…
nannu preminchenu nannu rakshinchenu 
kastakalamandu naaku todaiyundenu

agaka ne saagipodhunu 
na prabhuvu chupinchu batalo
addankulenni nannu chuttina  
na devuni ne viduvakundunu

na vaalle nannu vidachina 
na bandhuvule duramaina
ea todu leka ontarinainanu 
na todu kreesthani anandinthunu

Nee Dayalo Nee Krupalo

Nee Dayalo Nee Krupalo


నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము
నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము
నీ ఆత్మతో నను నింపుమా
నీ సేవలో ఫలియింపగా
దేవా… దేవా…           ||నీ దయ||

కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా
ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2)
ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు
నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2)
ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా
నీవె నా మార్గము – నీవె నా జీవము
నీవె నా గమ్యము – నీవె నా సర్వము
నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా           ||నీ దయ||

ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి
వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2)
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని
నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2)
నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం
నీవె నా తోడుగా – నీవె నా నీడగా
ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా
నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా            ||నీ దయ|| దయలో నీ కృపలో కాచితివి గతకాలము
నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము
నీ ఆత్మతో నను నింపుమా
నీ సేవలో ఫలియింపగా
దేవా… దేవా…           ||నీ దయ||

కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా
ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2)
ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు
నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2)
ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా
నీవె నా మార్గము – నీవె నా జీవము
నీవె నా గమ్యము – నీవె నా సర్వము
నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా           ||నీ దయ||

ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి
వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2)
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని
నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2)
నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం
నీవె నా తోడుగా – నీవె నా నీడగా
ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా
నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా            ||నీ దయ||

Tuesday, 26 November 2019

తీపి ఆశల మందారాలు

*ప్రవేశ గీతం*
తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ 
చిలిపి ఊసులు సింధూరాలు కలబోసిన శుభవేళ 
అనురాగంతో ఒకటవ్వాలని 
అనుకున్నవన్నీ నిజమవ్వాలని 
ఆ.ప. ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం 
దీవిస్తూ శుభముగ మీ పరిణయం 

1. ఇన్నినాళ్లుగా వేచిన సమయం ఎదురుగ నిలచింది
చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది 
కలకాలం మీరు కలసి ఉండాలని 
చిరజీవం మీపై నిలిచి ఉండాలని 

2.త్రియేక దేవుని ఘన సంకల్పం ఇల నెరవేరింది
ఇరు హృదయాల సుందర స్వప్నం నిజముగ మారింది 
అరమరికలు లేక ఒకటి కావాలని 
పరలోక తండ్రికి మహిమ తేవాలని

Vivaha mannadi Marriage Song

వివాహ గీతం
వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది /2/

1. దేహములో సగ భాగముగా  
మనుగడలో సహచారిణిగా /2/
నారిగా సహకారిగ  
స్త్రీని నిర్మించినాడు దేవుడు /2/వివా/

2.  ఒంటరిగా ఉండరాదని
జంటగా ఉండ మేలని
శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు/2/వివా/

3.దేవునికి అతిప్రియులుగా ఫలములతో వృద్ధిపొందగా/2/ 
వేరుగా ఉన్నవారిని ఒకటిగ ఇల చేసినాడు దేవుడు /2/వివా/

Sunday, 2 September 2018

Ni chetito nannu pattuko


నీ చేతితో నన్ను పట్టుకో

పల్లవి:    నీ చేతితో నన్ను పట్టుకో 
               నీ ఆత్మతో నన్ను నింపుము
               శిల్పి చేతిలో శిలను నేను  
              అనుక్షణము నన్ను చెక్కుము

1.      ఘోరపాపిని నేను తండ్రి 
          పాప ఊబిలో పడియుంటిని
         లేవనెత్తుము శుద్ధిచేయుము 
         పొందనిమ్ము నీదు ప్రేమను ||నీ||

2.      అంధకార లోయలోన 
         సంచరించిన భయము లేదు
         నీవాక్యం శక్తిగలది
         నా త్రోవకు నిత్య వెలుగు ||నీ||

3.    ఈ భువికి రాజువు నీవే 
       నాహృదిలో శాంతి నీవే
       కుమ్మరించుము నీదు ఆత్మను 
       జీవితాంతం నీ సేవచేసెదన్ ||నీ||

Na hrudayam therichanu


నా హృదయం తెరిచాను

పల్లవి:      నా హృదయం తెరిచాను
                 నీ కోసమే తెరిచాను నీ కోసమే ప్రభూ
                నీ  మందిరం కావాలి నా మది ఎల్లప్పుడు ||2||

1.     నా ఆశవు నా శ్వాసవు నా గమ్యము నీవే
       నాలో వసియింపుము నా జీవన రాగమై ||2||
       నన్ను నీవు మరిచావో నా బ్రతుకే శూన్యం
       నీ సన్నిధియేకదా నాకు పెన్నిధి ప్రభువా ||2|| ||నా||

2.     నీ రప్పల మాటున నన్ను దాగిపోనీ
       నీ ఆలయ దీపానికి ఆజ్యమై కరిగిపోనీ ||2||
       నీ చరణాలపై వాలే ధూళిరేణువు కానీ
       నీ దరినే కడదాక నన్ను ఉండిపోనీ ||2||