Tuesday, 26 November 2019

తీపి ఆశల మందారాలు

*ప్రవేశ గీతం*
తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ 
చిలిపి ఊసులు సింధూరాలు కలబోసిన శుభవేళ 
అనురాగంతో ఒకటవ్వాలని 
అనుకున్నవన్నీ నిజమవ్వాలని 
ఆ.ప. ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం 
దీవిస్తూ శుభముగ మీ పరిణయం 

1. ఇన్నినాళ్లుగా వేచిన సమయం ఎదురుగ నిలచింది
చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది 
కలకాలం మీరు కలసి ఉండాలని 
చిరజీవం మీపై నిలిచి ఉండాలని 

2.త్రియేక దేవుని ఘన సంకల్పం ఇల నెరవేరింది
ఇరు హృదయాల సుందర స్వప్నం నిజముగ మారింది 
అరమరికలు లేక ఒకటి కావాలని 
పరలోక తండ్రికి మహిమ తేవాలని

Vivaha mannadi Marriage Song

వివాహ గీతం
వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది /2/

1. దేహములో సగ భాగముగా  
మనుగడలో సహచారిణిగా /2/
నారిగా సహకారిగ  
స్త్రీని నిర్మించినాడు దేవుడు /2/వివా/

2.  ఒంటరిగా ఉండరాదని
జంటగా ఉండ మేలని
శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు/2/వివా/

3.దేవునికి అతిప్రియులుగా ఫలములతో వృద్ధిపొందగా/2/ 
వేరుగా ఉన్నవారిని ఒకటిగ ఇల చేసినాడు దేవుడు /2/వివా/