Saturday, 12 May 2018

Nee Adugulo Na Payanam Vol- 4

ప్రవేశ గీతం 
       రచన, స్వరకల్పన : బ్ర.  ప్రవీణ్ కుమార్ alcp/oss 
గుడి గంటలు మ్రోగినవేళ
పరుగున రారే ప్రియజనమా
క్రీస్తు ప్రభునికిది అర్చన సమయము
దివ్య పూజలో పాల్గొన రండి
యేసుని మహిమలు పొందగా రండి

రారే రారే ఓ దైవ జనమా
క్రీస్తుని కొలవంగా త్వరపడి రారే

1. పరవశ హృదయాలతో ప్రభుని కొలిచెదము
    మేళ తాళాలతో క్రీస్తుని పొగడెదము
    వ్యాధులు బాధలు తొలగించగా వేడెదము
    దివ్య తేజుని పొగడి మహిమ చాటెదము

2. సుమధుర వాక్యమును ఆలించ చేరెదము
    ధూప దీపముతో పూజింప పాల్గొందుము
    జీవిత గమ్యమంత యేసుతో నడిచెదము
   యేసుని కలుసుకొని ప్రభు ప్రేమను చాటెదము

అనుక్రమ గీతం
రచన, స్వరకల్పన: Fr. Isaac

నీ ప్రేమతో ప్రభు మేము పయనింతుము
నీ  వాక్కును ప్రభు మేము ప్రకటింతుము

1. తేనెకన్న తియ్యనైనది నీ  వాక్యం
    జుంటే తేనె దారలకన్నా మధురమైనది నీ  వాక్యం
   తియ్యనైనది తియ్యనైనది తియ్యనైన నీ వాక్యము
   మధురమైనది మధురమైనది మధురమైన నీ వాక్యము

2. కటిక చీకటి యందు వెలుగు నీ వాక్యం
    గాఢాంధకారం నందు నడుపు నీ వాక్యం
    జ్యోతిగా జ్యోతియై శాంతి క్రాంతి నింపెను
    దివ్వెగా దీపమై శాంతి క్రాంతి నిచ్చెను

అల్లేలూయా గీతం
  రచన, స్వరకల్పన : బ్ర.  ప్రవీణ్ కుమార్ alcp/oss  
అల్లేలూయా అల్లేలూయా
దివ్యవాణి మధురవాణి ధరనికేతించెను
దైవ వాక్కు ప్రేమచూపి జీవమిచ్చును
అల్లేలూయా అల్లేలూయా .......

1. జీవమిచ్చు వాక్కునీవే నా యేసయ్యా
    నాదు  బ్రతుకులో మార్పునిచ్చిన జీవధాయక
    నీదు ఆత్మతో హృదిని నింపి నన్ను నడిపించుమా
    నీ  సాక్షిగా నే చాటెద నీదు వాక్యము

2. జీవకోటి ప్రాణులన్ని నీ సృష్టి భాగ్యమే
    బలము ధైర్యము ఒసగుచున్న ప్రేమ రూపుడా
    నీ మహిమతో నన్ను నింపి ఆదరించుమా
    నీ సాక్షిగా నే చాటెద నీదు వాక్యము

అర్పణ గీతం
రచన, స్వరకల్పన:Fr. Isaac

ప్రభువా నీ పాదపూజకు నేనర్పించెద మనసారా
అప్పద్రాక్ష రసములను స్వీకరించుమా
మా దీన ఫలములను ఆదరించుమా
అర్పించగా వచ్చితిమి దీవించుమా దీవించుమా

1. నా సర్వము సకలం నీ ఒసగిన దానములు 
    అర్పించగా చేరాను నీ పాద సన్నిదికి 
    ఆదరించుమా ఆశీర్వదించుమా 
   ప్రియమార చేకొని దీవించుమా 

2. ఈ భూమి ఫలములు నీ ప్రేమ సిరులు 
    సమర్పించగా వచ్చాము ఈ దివ్య బలిలో 
    స్వీకరించుమా అంగీకరించుమా 
    ముదమార చేకొని దీవించుమా 

విందు గీతం 
  రచన, స్వరకల్పన : బ్ర.  ప్రవీణ్ కుమార్ alcp/oss 
ఈ దివ్య భోజ్యం ప్రభు యేసు ఒసగిన విందు 
అందుకొనగ వేగమె  రండి ఓ దైవ జనమా 
ఆత్మాదాహం తీర్చును అద్భుత విందు 
లోకొన రా రండి ప్రభు జనులారా 

1. కడ రాత్రి సమయమునందు 
    పలికెను తన శిష్యులకు 
    ఇది నా శరీర రక్తం ఆరగించుడి 
    ఈనాడు మనకోసం వెలసినాడు దివ్య పూజలో 
    గోధుమ రొట్టెగా ద్రాక్ష రసముగా 

2. రోగ పాపములన్ని పారద్రోసే విందు 
    మనలను పవిత్రపరచే ప్రభుని ప్రసాదం 
    లోకానికధిపతిగా పాపుల రక్షణకై 
    జన్మించినాడు పశువుల తొట్టెలో 

విందు గీతం 
  రచన, స్వరకల్పన : బ్ర.  ప్రవీణ్ కుమార్ alcp/oss  
విందు విందు  ప్రభు యేసుని విందు 
పొందు పొందు ప్రభు క్రీస్తుని దీవెన పొందు 
కరములు జోడించి శిరమును వంచి 
భక్తితొ  లోకొనుము 
ప్రభు యేసు విందును మనసార 
పొందుము ప్రియమారా 

1. రాజ్యమంత వెదకిన దొరకనిది ఈ విందు 
   లోకమంత ఇచ్చిన సరితూగనిది ఈ విందు 
   మానవ రక్షణ కొరకై కలువరి బలి విందు 
   రాజాది రాజుని ప్రాణత్యాగ మీ విందు 

2. ఆత్మ ఆకలి తీర్చే ఆత్మాహారం 
    కడవరకు శక్తినిచ్చే కడరా భోజనం 
    దోషములు మన్నించే దైవకుమారుని విందు 
    పరమునుండి దిగివచ్చిన పరలోకపు విందు 

ప్రవేశ గీతం 
రచన, స్వరకల్పన: Fr. Isaac

ఆలయ ద్వారం తెరవండి 
తండ్రి దేవుని పూజింప 
యేసుని బలిలో పాల్గొని 
ఆనంద గీతము పాడగా 
పరుగులు తీసి రా రండి 
స్వాగత గీతం పాడండి 

1. నీ దివ్య నామము స్మరియించగా
    వచ్చాము దేవా నీ సన్నిధికి
    స్వరములు కలిపి నిను కీర్తించగా
    నీ వరములు కురిపించుమా
    నీ దీవెనలు ఈ స్థలంలో

2. నీ దివ్య నామము వినాలని 
   చేరాను దేవా నీ  మందిరముకు 
   కరములు జోడించి నిను ప్రార్ధించగా 
   ప్రేమ ఫలములు కురిపించుమా  
    పవిత్రపరచుము ఈ బలిలో 

మరియ మాత గీతం 
  రచన, స్వరకల్పన : బ్ర.  ప్రవీణ్ కుమార్  alcp/oss 
మహిమోన్నతలకు మాతవు నీవు మరియా 
మహార్భుతా చరిత్ర మన్యవు నీవు 
మానవులు వినగా మహిమలు  చేయగా 
రమ్మా మా మరియా  
లూర్దు నగరిలో లూర్దు మాతగా 
వెలసిన మరియమ్మా (మా మరియా)

1. సదమల రూపిణి సద్గుణ శీలి 
    మానవ రక్షణ కారణ మూర్తి 
    అనుక్షణము మమ్ము విడువకు నీవమ్మా 
    నీ కుమారుని చెంత మము చేర్చరావమ్మ 
    వినుమమ్మా మా మొరలన్ 
   ఓ మేరిమాత మా లూర్దు మాత 

2. పరిశుద్దాత్మ అనురాగ బందమా 
    భక్తకోటి జనులా ఆదర్శ ప్రాయమా 
    ఈదీన హృదిని వినుమో మా అమ్మా 
    మాతో కడవరకు నిలువుము మా అమ్మా 
    వినుమమ్మా మా మొరలన్ 
   ఓ మేరిమాత మా లూర్దు మాత